News

కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ మృతి

363views

కశ్మీర్: కశ్మీర్‌ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్ళుగా తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొంతకాలంగా అల్తాఫ్ క్యాన్సర్​తో బాధపడుతున్నాడు.
అంతకుముందు మెరుగైన వైద్యం కోసం అల్తాఫ్​ను ఎయిమ్స్​కు తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తన తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ రువాషా భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది. జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి.. అల్తాఫ్ స్వయానా అల్లుడు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో 2017లో అల్తాఫ్ అరెస్ట్ అయ్యాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి