News

ఏపీలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించిన ధార్మిక పరిషత్

388views

అమరావతి: రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళ‌కు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, కోనసీమ జిల్లా, శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, గుణుపూడి, భీమవరం, శ్రీ నీల మణి దుర్గా అమ్మవారి దేవాలయం, పాతపట్నం, శ్రీకాకుళం, శ్రీ కోదండరామ స్వామి దేవాలయలం, తిమ్మయ్యపట్నం, తిరుపతి జిల్లాలోని దేవాలయాల పాలక మండళ్ళ‌కు రాష్ట్ర ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపిందన్నారు.

సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2009 తదుపరి 13 ఏళ్ళ త‌ర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.25 లక్షల నుండి రూ.1.00 కోటి వరకూ ఆదాయం ఉన్న పై తెల్పిన దేవాలయాల పాలక మండళ్ళ‌ను ఆమోదించడంతో పాటు మఠాలకు సంబంధించిన వాటిపై సమగ్రంగా చ‌ర్చించామ‌ని, ముఖ్యంగా హాథీరాంజీ మఠం, బ్రహ్మంగారి మఠం, గాలిగోపుర మఠం, బ్రహ్మనంద మఠం, జగ్గయ్యపేట, అహాబిలం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం పై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి వాటి విధి, విధానాలను పరిశీలించిన‌ట్టు తెలిపారు.

డం జరిగిందన్నారు. హాథీరాం మఠం దాదాపు 650 సంవత్సరాల క్రింతం ఏర్పడిందని, ఈ మఠానికి సంబందించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ఆ వివరాలను తదుపరి వెల్లడిస్తామన్నారు. జగ్గయ్యపేటలోని బ్రహ్మనంద మఠానికి సంబందించి సమగ్ర వివరాలపై నివేదిక రూపొందించి ధార్మిక పరిషత్ కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబందించి పూర్తి వివరాలను తదుపరి సమావేశంలో సమగ్రంగా వివరిస్తానని ఆయన తెలిపారు.

నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనంగా రూ.20 వేలు…

అసిస్టెంట్ కమిషనర్, డిప్యుటీ కమిషనర్, జాయింట్ కమిషనర్ హోదా స్థాయి దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల న్యాయమైన కోర్కెను సానుకూలంగా పరిశీలించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వారి జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రతి నెలా వారికి కనీస వేతనం రూ.20 వేలు అందేలాచూడాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి