
345views
న్యూఢిల్లీ: తలాక్ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. తలాక్-ఈ-కినాయా, తలాక్-ఈ-బైన్ తదితరాల పేరుతో ఇస్తున్న విడాకుల చట్టబద్ధత గురించి జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జేబీ పర్దీవాలా సభ్యులుగా ఉన్న ధర్మాసనం కేంద్ర న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులను అందజేసింది. ఈ సంప్రదాయం ఏకపక్షం, న్యాయ విరుద్ధమని.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదని కర్ణాటకకు చెందిన సయీదా అంబ్రీన్ వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. విడాకులకు సంబంధించి లింగ, మత సమానత్వాన్ని పాటిస్తూ కేంద్రం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్ విన్నవించారు.





