News

గో ఆధారిత ఉత్పత్తులతో క్యాన్సర్ నివారించవచ్చు… మహిళా ఉద్యోగులకు టీటీడీ అవగాహన సదస్సు

442views

తిరుప‌తి: ప్రశాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గోఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చని టీటీడీ ఈఓ ధ‌ర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అవ‌గాహ‌న కార్యక్రమాన్ని సినీనటి గౌత‌మితో కలిసి ఆయన ప్రారంభించారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్సర్ రావ‌చ్చని.. స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్పత్తుల వినియోగంతో దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చని గౌతమి అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి