News

జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

428views

టోక్యో: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో తాను జపాన్​కు వచ్చినప్పుడు చాలా సమయం మాట్లాడకున్నామని చెప్పారు. అబే.. భారత్​, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను​ మరో ఎత్తుకు తీసుకెళ్ళారని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మైత్రి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు మోదీ.

మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం టోక్యో వెళ్ళిన నరేంద్ర మోదీ.. జపాన్​ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబే అంత్యక్రియల కోసం జపాన్​కు వచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు కిషిద. అంతకుముందు మేలో జరిగిన క్వాడ్​ సమ్మిట్​లో పాల్గొన్న మోదీ.. కిషిదతో సమావేశమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి