
467views
విజయవాడ: తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్ళి రోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం, 7:30 కి ప్రాతఃకాల అర్చన అనంతరం బాలభోగ నివేదన తరువాత ఉదయం తొమ్మిది గంటల నుండి స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవి గా భక్తులకు దర్శనం ఇస్తోంది.
మొదటి రోజు అమ్మవారికి బంగారపు రంగు చీర కట్టి, కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు,ని నైవేద్యంగా సమర్పించారు. అంతే కాకుండా అమ్మవారిని దర్శిచుకుంటే శత్రు బాధలు తొలుగుతాయని, జీవితం ఆనందంగా ఉంటుంది అని భక్తుల నమ్మకం. మొదటి రోజే గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు, ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.





