News

యూకే, యూరప్ దేశాలలో శ్రీనివాస కల్యాణోత్సవాలు

294views

తిరుప‌తి: యూకే, యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పది (10) నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్టు టీటీడీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్భంగా “శ్రీనివాస కల్యాణోత్సవం” పోస్టర్లను ఆవిష్క‌రించారు. జూన్, జూలై 2022 నెలలలో అమెరికాలోని తొమ్మిది నగరాల్లో అంగరంగ వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణాలు ఆయా అసోసియేషన్ల సహకారంతో జ‌రుగనున్నాయి. అనంతరం యూకేలోని యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (UKTA) కోరిక మేరకు యూకే, యూరప్ దేశాలలోని భక్తుల కోసం తితిదే శ్రీవారి కల్యాణాలు నిర్వ‌హించ‌నుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి