
130views
-
ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతున్న నిజాలు
న్యూఢిల్లీ: ప‌్రధాన మంత్రి నరేంద్ర మోదీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్ర పన్నింది. ఎన్ఐఏ ఆ సంస్థ నాయకులను విచారించగా ఈ విషయం వెల్లడైంది. జులైలో పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేసినట్టు స్పష్టమైంది. దాడులు చేసేందుకు పలువురికి పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇంకా, యూపీకి చెందిన మరికొందరు ప్రముఖులపైనా దాడులకు కుట్ర పన్నింది.