
339views
విజయవాడ: దసరా పండుగ రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4వేల 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే ఛార్జీలనే ప్రత్యేక బస్సుల్లో వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని.. ఈ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉందన్నారు.





