News

వెంక‌న్న‌కు రూ.1.02 కోట్ల విరాళం

414views

తిరుప‌తి: శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్‌, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు. అంతకుముందు వారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి