
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు, వలసవాద పద్ధతులు, బ్రిటిష్ పేర్లను మార్చేందుకు భారత సైన్యం సమాయత్తమైంది.
సిక్కు, గోర్ఖా, జాట్, రాజ్‌పుత్ వంటి సైనిక యూనిట్ల పేర్లు కూడా మార్చాలని ఆర్మీ యోచిస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాలు, నిబంధనలు, చట్టాలు, నియమాలు, విధానాలు, ఆంగ్ల పేర్లను సమీక్షించి అవసరమైన వాటికి మార్పులు చేయాలని ఆర్మీ నిర్ణయించింది.
వారసత్వ సైనిక అభ్యాసాలు, విన్యాసాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కట్టడాలు, భవనాలు, సంస్థలు, రోడ్లు, ఉద్యానవనాలకు పెట్టిన బ్రిటిష్ కమాండర్ల పేర్లను కూడా తొలగించాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది.
Source: EtvBharat