News

డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

311views

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ (జీఎఫ్‌ఎఫ్‌) సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

ప్రధాని సందేశాన్ని జీఎఫ్‌ఎఫ్‌ 2022 అడ్వయిజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ క్రిష్‌ గోపాలకృష్ణన్‌ చదివి వినిపించారు. ‘జన్‌ ధన్‌- ఆధార్‌- మొబైల్‌ (జేఏఎం), యూపీఐ విజయవంతం ద్వారా మన జీవితంలో డిజిటల్‌ చెల్లింపులు భాగమయ్యాయి. ఫిన్‌టెక్‌, అంకురాల విభాగంలో ఆవిష్కరణలకు, పెట్టుబడులకు అంతర్జాతీయ ప్రధాన కేంద్రంగా భారత్‌ అవతరించేందుకు ఇది దోహదం చేస్తుంద’ని మోదీ తెలిపారు. నాణ్యమైన ఆర్థిక సేవల ద్వారా నిరుపేదలను కూడా ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి