News

పురాతన విగ్రహాల స్వాధీనం

358views

చెన్నై: తమిళనాడు లోని విల్లుపురం బొమ్మయార్‌పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణంలో పాత విగ్రహాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణం వెనుకవైపున్న తోటలో దాచిన అర్ధనారీశ్వరుడు, శివగామిఅమ్మాళ్‌, కృష్ణుడు, బుద్ధుడు, నెమలి వాహనం విగ్రహం సహా 7 ప్రాచీన విక్రయాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని కుంభకోణం కోర్టులో అప్పగించి, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి