News

వీఐపీలకు మాత్రమే దుర్గమ్మ అంతరాలయ దర్శనం

398views

విజ‌య‌వాడ‌: బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలకు స్లాట్‌ విధానం అమలు చేయడం లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

ఘాట్‌ రోడ్డు ద్వారా మరో క్యూలైన్‌లో వీఐపీలను అనుమతించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహామండపం ద్వారా అనుమతించాలన్న నిర్ణయాన్ని పక్కనపెట్టామన్నారు. వీఐపీలకు మినహా తొమ్మిది రోజులపాటు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నామని తెలిపారు. రూ.500, 300, 100, ఉచిత దర్శనం ద్వారా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. లడ్డూ ధర పెంచే యోచన లేదని, రూ.15కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందన్నారు.

తోపులాటలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు క్యూలైన్లు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు, వీఐపీల రిఫరెన్స్‌ ఉన్న ప్రతి ఒక్కరూ రూ.500ల టికెట్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఏర్పాట్లపై ఎమ్మెల్యేల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పోలీసులు స్లాట్‌ దర్శనం కల్పిస్తామన్నారు కానీ, స్లాట్‌ సిస్టమ్‌పై మరోసారి చర్చించాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి