News

బెంగాల్ స్కూల్​లో బాంబు పేలుడు!

338views

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో బాంబు పేలింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్​లోని ఫ్రీ ఇండియా హైస్కూల్‌లో శనివారం ఉద‌యం 11.30 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పాఠశాల పైకప్పు ధ్వంసమైంది. విరామ సమయంలో ఘటన జరగడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. హఠాత్తుగా భారీ శబ్ధం రావడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి