News

ప్రధాని మోదీ జ్ఞాపికల ఈ వేలం నేటి నుండే…

297views

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో కానుకలుగా వచ్చిన జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు అర్జున్ సింగ్ మేఘవాల్, మీనాక్షి లేఖితో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఎన్జీఎంఏలో ఉంచిన నరేంద్ర మోదీకి విదేశీ, రాష్ట్ర, ప్రాంత పర్యటనల్లో ప్రముఖులు అందజేసిన జ్ఞాపికలు, క్రీడాకారులు ఇచ్చిన వస్తువులను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ వేలం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఎవరైనా కానుకలను వేలంలో దక్కించుకోవచ్చని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి