News

ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న మోదీ

375views

న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్తాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ‌ తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్‌ విషయంలో చైనా దూకుడు క్రమంలో జరుగుతున్న ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో.. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఈ కూటమికి చెందిన సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి