News

ప‌ల్లెల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల సంద‌డి

367views

అన‌కాప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకొని ఆయా ఉత్స‌వ క‌మిటీలు పలు కార్యక్రమాలు చేప‌ట్టాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గణపతి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తి కావ‌డంతో ఉత్సవాల నిర్వాహకులు భారీ అన్న సమరాధనలు నిర్వ‌హించారు. మాడుగులలో శనివారం జవ్వాది గెడ్డ కూడ‌లి, నూకాలమ్మ కాల‌నీ, మోద‌మాంబ కాల‌నీలో భారీ అన్న సమారాధన నిర్వహించారు.

స్థానిక నూకాల‌మ్మ కాల‌నీలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో గవరవీధికి చెందిన భజన మండలి సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మూడు రోడ్ల కూడ‌లితోపాటు ప‌లుచోట్ల ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌ను శనివారం సాయంత్రం అనుపు మహోత్సవం నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి