News

నేత్రదానంపై అవగాహన సదస్సు

369views

నంద్యాల‌: నంద్యాల నగరంలో ఈ నెల ఏడోతేదీన నేత్రదానం పక్షోత్సవాలు పుర‌స్క‌రించుకుని నేత్రదానం పై అవగాహన సదస్సు జరిగింది. దివ్యాంగుల అభ్యున్న‌తికి నిరంత‌రం పాటుపడుతున్న అఖిల భారతీయ సేవా సంస్థ సక్షమ్ ఆధ్వ‌ర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న మహర్షి అకాడమీ, సుభాష్ చంద్రబోస్ ఆర్మీ కోచింగ్ సెంటర్‌లో జ‌రిగింది.

నేత్రదానం ఎందుకు చేయాలి, దేశం మొత్తం మీద నేత్ర దానాలు ఎంత అవసరం ఉన్నది, నేత్ర దానాలు ఎలా చేయాలి.. అనే విషయంపై డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. 36 మంది విద్యార్థులు స్పందించి నేత్ర దాన ప్రతిజ్ఞ చేశారు. అంత‌కుముందు నేత్ర‌దానంపై 46 మందితో ప‌ట్ట‌ణంలో ర్యాలీ నిర్వహించారు.

క‌ర్నూలులో…

క‌ర్నూలులో కూడా నేత్ర‌దానంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు, ర్యాలీ ఈ నెల ఆరోతేదీ జ‌రిగింది. స్థానిక మాస్ట‌ర్ జూనియ‌ర్ కాలేజీలో జ‌రిగిన స‌ద‌స్సులో
విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలేజీ క‌ర‌స్పాండెంట్ శ్రీ‌రామ్ ల‌క్ష‌ణ్ రెడ్డి, స‌క్ష‌మ్ క‌ర్నూల్ న‌గ‌ర అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ బ‌ట్టు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి