News

బెంగాల్లో భారీగా పట్టుబడ్డ నగదు

284views

* గేమింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ దోపిడీ

శ్చిమ బెంగాల్‌లో మోసపూరిత మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టగా.. భారీ మొత్తంలో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.7కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగాల్ ‌కు చెందిన ‘ఇ-నగెట్స్‌’ అనే గేమింగ్‌ యాప్‌ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్ ‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రమోటర్‌ ఆమిర్‌ ఖాన్‌ నివాసంతో పాటు 6 చోట్ల శనివారం సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల సమయంలో అతని ఇంట్లో లెక్కల్లోకి రాని నగదు భారీ మొత్తంలో బయటపడింది. దీంతో అధికారులు లెక్కింపు మొదలుపెట్టగా.. ఇప్పటివరకు రూ.7కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ యాప్ ‌కు.. చైనా నియంత్రణలో నడుస్తోన్న రుణ యాప్ ‌లతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ యాప్ ‌ను ఆమిర్‌ కుమారుడు నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.