News

వాస్తవధీనరేఖ వెంట భారత వాయుసేన విస్తరణ ప‌నులు

141views
  • జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం

న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపాన చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి తోడు మరో తొమ్మిది వ్యూహాత్మక ప్రాజెక్టులకు కూడా ఈ మండలి పచ్చజెండా ఊపింది.

చాంగ్‌థాంగ్‌, కారాకోరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిధిలోకి ఇవి వస్తాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ చర్యలు తీసుకొంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి