News

నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు… పెద్ద ఎత్తున శోభాయాత్ర

513views

భాగ్య‌న‌గ‌రం: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్ళ‌నున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు.  గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది.

మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్‌ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్‌ మోడల్‌ మెకానికల్‌ ట్రయిలర్‌ ఓల్వో ఇంజిన్‌ సామర్థ్యం. డీఎస్‌–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్‌ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి