
467views
-
ముళ్ళపై నడిచి భక్తులను ఆశ్చర్యపరిచిన పూజారి
అనంతపురం: అనంతపురం జిల్లా బెళుగుప్ప తండాలో మూడు రోజుల నుంచి మారెమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి చేసిన సాహసం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. కుప్పగా పేర్చిన ముళ్ళకంపలపై నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడే పడుకోవడం వంటి సాహసాలు చేశాడు. అది చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న యువతులు వేసిన లంబాడి నృత్యం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సిరిమానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పొడవాటి మొద్దుకు పూజారిని కట్టి.. పైకి ఎత్తి గాలిలో తిప్పారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.





