
-
బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ
న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో ఇరు దేశాల ప్రధానులు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. షేక్‌హసీనా.. నరేంద్ర మోదీ సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఏడు ఎంఓయూలపై సంతకాలు చేశారు.
భారత్, బంగ్లాదేశ్ స్నేహం పరస్పర సహకార స్ఫూర్తితో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తీస్తా నీటి పంపిణీ సహా అన్ని సమస్యలకు త్వరలో ముగింపు పలకాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు.. ఇరు దేశాల విశ్వాసంపై దాడి చేయాలనుకునే శక్తులను కలిసి ఎదుర్కోవడం చాలా అవసరమని మోదీ అన్నారు.





