News

బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా భార‌త‌ సంత‌తి మ‌హిళ బ్రెవ‌ర్మాన్

389views

న్యూఢిల్లీ: భార‌త సంత‌తికి చెందిన న్యాయ‌వాది సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు. మ‌రో భార‌తీయ సంత‌తి మ‌హిళ ప్రీతి ప‌టేల్ స్థానంలో బ్రెవ‌ర్మాన్ ఆ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌నున్నారు. రెండు రోజుల క్రితం బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా ఎన్నికైన లిజ్ ట్ర‌స్ కొత్త క్యాబినెట్‌ను విస్త‌రిస్తున్నారు.

42 ఏళ్ళ‌ కన్జ‌ర్వేటివ్ పార్టీ నేత అయిన బ్రెవ‌ర్మాన్‌ గ‌త బోరిస్ ప్ర‌భుత్వంలో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా చేశారు. బ్రెవ‌ర్మాన్‌ను హోంశాఖ మంత్రిగా కొత్త ప్ర‌ధాని లిజ్ నియ‌మించారు. సుయెల్లా బ్రెవ‌ర్మాన్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలో న్యాయ విద్య‌ను అభ్య‌సించారు. 2018లో రాయ‌ల్ బ్రెవ‌ర్మాన్‌ను ఆమె పెళ్లాడారు. క్యాబినెట్ మంత్రిగా ఉంటూనే ఆమె రెండో పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. బ్రెవ‌ర్మాన్ బౌద్ద మ‌తాన్ని స్వీక‌రించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి