
452views
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామకాలు ఆంధ్ర ప్రదేశ్‌లో కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఏపీలో రెండో దశ ఎంపిక ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి దశలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆగస్టు 15 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగిసింది.
శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు 13 జిల్లాలకు చెందిన అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ విశాఖపట్నంలో కొనసాగింది. ఇక మిగిలిన 13 జిల్లాల ఎంపిక రెండో దశలో భాగంగా నెల్లూరు ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 15 నుంచి 26 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని ఆర్మీ అధికారి కల్నల్ ఎస్ కోహ్లీ తెలిపారు.
Source: Nijamtoday





