
మంగళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
దాదాపుగా రూ. 3,800 కోట్ల విలువ కలిగిన యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ పథకాలకు మంగళూరులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ఈ రోజు భారతదేశం చరిత్రలో ఒక మరపురాని రోజు అని చెప్పారు. అది ప్రాదేశిక భద్రత కావచ్చు, లేదా ఆర్థిక భద్రత కావచ్చు, భారతదేశం పెద్ద పెద్ద అవకాశాలకు నిలయంగా ఉందని ఆయన తెలిపారు.
ఇదే రోజు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తొలిసారిగా ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రారంభించుకోవడాన్ని ప్రధాని గుర్తు చేస్తూ ఇది అభివృద్ధికి తోడ్పడే ఒక ముఖ్యమైన మంత్రం అని స్పష్టం చేశారు. ఇటువంటి కృషి ఫలితంగా భారతదేశం లోని నౌకాశ్రయాల సామర్థ్యం కేవలం 8 సంవత్సరాల లో దాదాపుగా రెట్టింపు అయిందని ఆయన తెలిపారు.
Source: Nijamtoday





