
431views
న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ తెలిపారు. ఈ సమాచారం ద్వారా మోసపూరిత లావాదేవీలు నిర్వహించే వారిని సులువుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. దీన్ని ఎప్పటిలోగా తీసుకొచ్చేదీ ఇప్పుడే చెప్పలేమని, దీనికి సంబంధించి భాగస్వాములందరితో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.





