
దుబాయ్: ఆసియాకప్ భారత్ దాయాది పాక్‌పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత దళం విజృంభించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ 26 పరుగులకే 4 వికెట్లు తీసి పాక్ కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు.
ఆల్‌రౌండర్ హార్దిక్ చెలరేగి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వీరికి అర్షదీప్ 2, ఆవేశ్‌ఖాన్ ఓ వికెట్ తీసి సహకరించారు. దీంతో పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ టాపార్డర్ తడబాటుకు గురైనా మిడిలార్డర్ ఆదుకోవడంతో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. భారత్ విజయంలో కోహ్లీ జడేజా హార్దిక్ 33 పరుగులుతో కీలకపాత్ర పోషించారు. ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం గ్రూప్ ఎలో దాయాదులు భారత్-పాక్ మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ రసవత్తరంగా జరిగింది.
Source: Nijamtoday





