
భాగ్యనగరం: బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రకరకాల పేర్లతో కాల్స్ ఏసి భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించి తలపెట్టిన నిరసన కార్యక్రమాలు వెంటనే రద్దు చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
అయితే, వాస్తవంగా విశ్వహిందూ పరిషత్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను మార్పిడి చేసి వైరల్ చేశారు. కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు జోడించి జనాల్లోకి వదిలారు. దీనిపై బాలస్వామి స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళన
వాస్తవానికి బాలస్వామి విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే గాక, పోలీసులే ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల పైకి ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు.
ప్రశాంతమైన భాగ్యనగరాన్ని అల్లర్లతో అట్టుడికించే కుట్ర సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనగా బజరంగ్ దళ్, విహెచ్ పి ఆందోళనకు సిద్ధమైందని తెలిపారు.
సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. పాత నగరంలో దాదాపు 100 మంది నేరస్తులను పోలీస్ స్టేషన్‌ల నుంచి తీసుకువెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై వెంటనే చర్యలు చేపట్టాలని బాలస్వామి డిమాండ్ చేశారు అల్లర్లకు పాల్పడిన యువకులపై చట్ట రీత్యా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
Source: Nijamtoday





