
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. యమునా ఖాదర్ అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ళ బాలిక విగత జీవిగా కన్పించింది. రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బీహర్‌లో ఉండేవాడు. అతను ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడు. అతను అక్కడ.. తుర్క్ మన్ గేట్ వద్ద కసాయిగా పనిచేస్తున్నాడు. అయితే.. రిజ్వాన్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఈ నెల తొలి వారంలో దర్యాగంజ్‌లో ఉండే మహిళతో పరిచయం ఏర్పంది. ఆమెను తరచుగా కలుసుకునే వాడు. ఈ క్రమంలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఒక రోజున ఇంట్లో ఉండగా, మహిళ కూతురు వీరిని చూసింది. ఈ క్రమంలో నిందితుడు.. రిజ్వాన్.. తెల్లవారు జామున బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెను తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత.. ఏంతెలియదన్నట్టు వచ్చేశాడు. బాలికను తల్లి వెతికింది. చివరకు చెరువు ఉన్న ప్రాంతంలో బాలిక విగత జీవిగా ఉండటాన్ని కొంత మంది గమనించారు. ఆమె శరీరంపై దుస్తులు లేవు. అంతే కాకుండా ముఖం కూడా కనిపించకుండా పూర్తిగా ఛిద్రం అయివుంది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు ప్రత్యేక పోలసులతో తనిఖీ చేపట్టారు. సీసీ కెమెరాలను జల్లేడ పట్టారు. నిందుతుడు బాలికను తీసుకెళ్తున్నట్లు రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి, విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Source: News18





