News

శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

392views

కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక ‘యువాన్ వాంగ్ 5’ ఓడ వాస్తవానికి ఆగస్టు 11న చైనా నడుపుతున్న ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది.

కానీ, అది ఆలస్యంగా చేరుకుని అక్కడ తిష్ఠ‌వేసింది. దీనిపై భద్రతాపరమైన ఆందోళనలను శ్రీలంకతో భారత్ లేవనెత్తింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హంబన్‌తోట ఓడరేవు వద్ద తిష్ఠ వేసిన వివాదాస్పద హైటెక్ చైనా పరిశోధన నౌక ఆరు రోజుల పర్యటన తర్వాత సోమవారం శ్రీలంక జలాల నుండి బయలుదేరింది.

చైనా ఓడ ఈ నెల 16న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:20 గంటలకు దక్షిణ శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవుకు చేరుకుంది. చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకొనే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది.

యువాన్‌ వాంగ్‌ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్‌ యిన్‌ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్ళిపోయిందని హార్బర్‌ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు.

దీని తదుపరి ‘పోర్ట్ కాల్’ చైనాలోని జియాంగ్ యిన్ పోర్ట్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు. నౌక పర్యటన సందర్భంగా ఇక్కడి చైనా రాయబార కార్యాలయం కోరిన అవసరమైన సహాయాన్ని శ్రీలంక అందించింది. హంబన్‌తోట నౌకాశ్రయానికి నౌక రావడం వివాదాస్పదంగా మారింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి