News

ముడుపుల కేసులో సీబీఐ కొరడా

364views

న్యూఢిల్లీ: అంబాలా కంటోన్మెంట్ ముడుపుల కేసులో సీబీఐ కొరడా ఝళిపించింది. ఒక సీనియర్ బరాక్ ఆఫీసర్, ఒక సుబేదర్ మేజర్‌తో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నిందితులపై కేసు నమోదు చేసింది. ముడుపులు తీసుకోవడం ద్వారా అంబాలా కంటోన్మెంట్‌కు సంబంధించిన ఎక్కువ కాంట్రాక్టులు సదరు కాంట్రాక్టర్లకే కేటాయించినట్టు సీబీఐ గుర్తించింది. లావాదేవీల సమయంలో సీబీఐ నిఘా ఉంచి ఇద్దరు ఆఫీసర్లను అదుపులోనికి తీసుకుంది. సెంట్రల్ ఏజెన్సీ జరిపిన సోదాల్లో లెఫ్టినెంట్ కల్నల్ నివాస ప్రాంతం నుంచి సుమారు రూ.32.50 లక్షల నగదు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఆ ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.16 లక్షలు స్వాధీనం చేసుకుంది. అరెస్టు చేసిన నలుగురిని కోర్టు ముందు సీబీఐ హాజరపరచనుంది.

Source: andhrajyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి