News

ఏడు ఇండియా-ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్ ర‌ద్దు

453views

న్యూఢిల్లీ: భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్తాన్ నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114 కోట్లకు పైగానే ఉంది. 85.73 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీంతో గ‌త డిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ చేసిన ఛాన‌ళ్ల సంఖ్య 102కు చేరుకున్న‌ది.

ఈ కంటెంట్ మానిటైజ్ అయింది. ఈ వివరాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రటకనలో వెల్లడించింది. సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ యూట్యూబ్ చానళ్లు భారత దేశానికి వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసేవిధంగానూ, ప్రజా శాంతికి విఘాతం కలిగించే విధంగానూ, భారత దేశ విదేశీ సంబంధాలు దెబ్బతినే విధంగానూ ఈ చానళ్ళలోని వీడియోలలో ప్రకటనలు ఇస్తున్నారు.

భారత ప్రభుత్వం మతపరమైన కట్టడాలను కూల్చేస్తోందని, మతపరమైన పండుగలను జరుపుకోవడంపై నిషేధం విధిస్తోందని, మత యుద్ధాన్ని ప్రకటించిందని ఈ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయని ఈ ప్రకటన తెలిపింది. భారత సైన్యం, జమ్మూ-కశ్మీరు వంటి అంశాలపై తప్పుడు, బూటకపు వార్తలను ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి