News

పాక్‌కు సేనలను పంపిస్తున్న చైనా!

449views

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో తాను చేపట్టిన ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులకు రక్షణ కల్పించేందుకు స్వయంగా తన ఆర్మీనే పంపాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే తమ జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి పాక్‌లో చైనా రాయబారి నోంగ్ రోంగ్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, విదేశాంగ బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బాజ్వాలతో సమావేశమై దీనిపై లోతుగా చర్చించారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టులు జరుగుతున్న గ్వాదర్, ఖుజ్దార్, హోషబ్, గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పీఎల్ఏ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాలని కూడా డ్రాగన్ పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తోంది. చైనా నుంచి 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పు తీసుకున్న పాకిస్తాన్‌కు మరో మార్గం లేదు. ఆర్ధికంగా దివాళా తీసిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మాట వినడం తప్ప షెబాజ్ షరీఫ్ సర్కారుకు మరో గత్యంతరం లేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి