News

21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ, అమిత్‌ షా రాక

350views

భాగ్య‌న‌గ‌రం: మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ తెలిపారు. మునుగోడు సభలో కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాటం చేయాలనే అంశాలపై పార్టీ శ్రేణులకు అమిత్‌ షా దిశా నిర్దేశం చేస్తారని ఆయన వెల్లడించారు. మునుగోడు సభలోనే తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. అలాగే ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇలా ఉండగా, బీజేపీ బుధవారం జరిపిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అమిత్ షా పాల్గొనే బహిరంగసభ ఏర్పాట్ల గురించి చర్చించారు. కానీ, విని ఎరుగని రీతిలో ఈ సభను విజయవంతం చేద్దామని అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి