News

జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులకు ఓటు హక్కు

468views

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ హిర్ దేష్‌కుమార్ స్థానికేతరులకు ఓటుహక్కు కలిపిస్తూ ప్రకటన చేశారు. స్థానికేతరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఓటు హక్కు కల్పిస్తూ జమ్మూకశ్మీర్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి హిర్‌దేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.

జమ్మూకశ్మీరులో నివాసం ఉంటున్న వారు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జమ్మూకశ్మీరులోని ఆర్మీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సైనికులు కూడా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనుమతించారు.

“బయటి వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావడానికి నివాసం అవసరం లేదు. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితుల్లో పోస్ట్ చేసిన ఇతర రాష్ట్రాల సాయుధ దళాల సిబ్బంది కూడా తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చవచ్చు” అని ఆయన చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి