News

వాజ్ పేయీకి నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

360views

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం ‘సదైవ్​ అటల్’కు తరలివెళ్లి.. ఆ మహానేత సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు వాజ్​పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి