News

కొండల రాయుడికి నైవేద్యంగా తేళ్ళు

495views
  • కర్నూలు జిల్లాలో వింత ఆచారం… పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపైన కొండల రాయుడు అనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి శ్రావణమాసం మూడో సోమవారం ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. వేడుకల వేళ కొండపైన దొరికిన తేళ్ళ‌ను పట్టుకుని.. స్వామికి నైవేద్యం పెడతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఏటా ఇలానే ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఈసారి వేడుకలకు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు.. కొండపైన ఉన్న రాళ్ళ‌ కింద తేళ్ళ‌ను పట్టుకున్నారు. వాటిని ఎలాంటి భయం లేకుండా చేతితో పట్టుకుని.. స్వామికి నైవేద్యం చెల్లించారు. గతంలో ఈ ఆలయానికి వచ్చి ఈ విధంగా మొక్కులు సమర్పించిన వారి కోరికలు నెరవేరాయని అందుకే ఇప్పుడు తామూ వచ్చి తీర్చుకుంటున్నామని భక్తులు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి