News

గిరిజన కాలనీలో రామాలయ విగ్రహ ప్రతిష్ట

548views

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు గిరిజన కాలనీలో ధర్మసింధు ఆధ్మాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మితమైన రామాలయంలో 15/8/2022 సోమవారం నాడు రామాలయం విగ్రహ ప్రతిష్ట అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారు విచ్చేసి దేవతా మూర్తుల ప్రతిష్ట గావించి అనుగ్రహ భాషణం చేశారు.

పూజ్య గురువులచే జాతీయపతాకావిష్కరణ

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయపతాకాన్ని చెన్నూరు గిరిజనకాలనీలో పూజ్య గురువులు భువనేశ్వరిపీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారు ఆవిష్కరించారు. రామాలయ ప్రతిష్టలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అందరూ పాల్గొనగా స్వామీజీ వారందరి చేత జాతీయగీతాన్ని ఆలపింపజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.