
384views
భాగ్యనగరం: ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు గోల్కొండ కోట, చార్మినార్‌కు ప్రవేశ రుసుం లేకుండానే అనుమతి మంజూరు చేసింది.
75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సందర్శకులకు ఈ అవకాశం కల్పించింది. అంతేకాదు.. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు, ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉచిత ప్రవేశం ఆగస్టు 5 నుండి 15 వరకు చెల్లుతుంది. అయితే.. ఇది భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Source: Eenadu
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





