News

జాతీయ జెండాల‌తో విద్యార్థుల ర్యాలీ

201views

నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు స్థానిక మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత మ‌హోత్స‌వం కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల‌తో విద్యార్థినీవిద్యార్థులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. స్థానిక మోడల్ స్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్‌కు ర్యాలీ చేప‌ట్టి, అక్క‌డ‌ మానవ హారంగా ఏర్ప‌డి, భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సైమన్ రావు, ఇంఛార్జి వైస్ ప్రిన్సిపాల్ మధుసూధన్ రెడ్డి, కాలేజ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి