
నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా నందమూరి నగర్, సుగాలి తాండలో ఇంటింటా హిందూ ధర్మప్రచారం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ ప్రమోద్ స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మీయ బంధువుల కుటుంబాలను కలిసి, హిందూ మతం విశిష్టతను స్వామిజీ వివరించారు. వారిళ్ళలో దీపాలు వెలగించారు. మతం మారడం వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు వివరించారు.

రాయలసీమ జోనల్ కన్వీనర్ రాంప్రసాద్ మాట్లాడుతూ మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారు… కుల వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.. తరతరాలుగా వచ్చే కుల ఆచారాలు, కట్టుబాట్లు అన్ని చెల్లాచెదరవుతాయని తెలిపారు.
ధర్మ రక్షణ సమితి బంజారా ప్రాంత సంయోజకులు హతిరాం నాయక్, రిటైర్డ్ ఎస్సై రాజు బంజారా కులానికి చెందిన వీరు వాళ్ళ కులం గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నగర సహ కన్వీనర్ సత్యం రెడ్డి, నంద్యాల సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ రామ నరసింహ, ధర్మజాగరణ కార్యకర్తలు పాల్గొన్నారు.





