News

పాకిస్తాన్‌లోని 1200 నాటి వాల్మీకి దేవాలయ పునరుద్ధరణ

447views

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని 1200 ఏళ్ళ‌ నాటి పురాతన హిందూ దేవాలయాన్ని ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు. లాహోర్ నగరంలో కబ్జా పాలైన వాల్మీకి మందిరం సుదీర్ఘ న్యాయపోరాటంతో పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. లాహోర్ నగరంలోని అనార్కలీ బజారులో ఉన్న వాల్మీకి దేవాలయాన్ని ఓ క్రైస్తవ కుటుంబం కబ్జా చేసింది. 20 ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం, పాకిస్తాన్ హిందూ యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.

దీంతో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ న్యాయపోరాటం చేసి పురాతన దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ దేశంలో హిందువులు చేసిన న్యాయపోరాటం ఫలించి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి. క్రైస్తవ కుటుంబం హిందూ మతాన్ని స్వీకరించి రెండు దశాబ్దాలుగా వాల్మీకి మందిరాన్ని కబ్జా చేసింది. అతి పురాతనమైన ఈ వాల్మీకి మందిరాన్నిభవిష్యత్‌లో మాస్టర్ ప్లాన్ ప్రకారం పునరుద్ధరిస్తామని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అధికార ప్రతినిధి అమీర్ హాష్మి చెప్పారు.

కబ్జా చెర నుంచి పురాతన వాల్మీకి ఆలయాన్ని విడిపించి బుధవారం 100 మంది హిందువులు, కొందరు సిక్కులు, క్రైస్తవ నాయకులు వాల్మీకి దేవాలయంలో పూజలు జరిపి అన్నదానం చేశారు. వాల్మీకి మందిరం స్థలాన్ని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ రెవెన్యూ రికార్డుల్లోకి బదిలీ చేశారు.

కానీ, 2010లో ఈ ఆలయ భూమి తమదేనని ఓ క్రైస్తవ కుటుంబం సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. దీంతో దేవాలయం భూ వివాదంపై కోర్టు విచారణ చాన్నాళ్ళు సాగింది. క్రైస్తవ కుటుంబం దావాను కోర్టు తప్పు పిటిషన్ అని కొట్టివేసింది. 1992వ సంవత్సరంలో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం కొందరు ఆందోళనకారులు వాల్మీకి దేవాలయంపై దాడి చేసి కృష్ణ, వాల్మీకి విగ్రహాలను ధ్వంసం చేశారు.

అప్పట్లో దేవాలయాన్ని కూల్చివేసి నిప్పు పెట్టడంతో కాలిపోయింది. దీనిపై హిందువులు కోర్టుకు వెళ్ళ‌డంతో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ ను నియమించింది. వాల్మీకి దేవాలయాన్ని పునరుద్ధరించి పాక్ హిందువులు పూజలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని సుప్రీం నియమించిన ఏకసభ్య కమిషన్ పాక్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి