
464views
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో సోదాలు చేపట్టింది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం ‘హెరాల్డ్ హౌస్’ సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన నేపథ్యంలో.. తాజా సోదాలకు ప్రాధాన్యం ఏర్పడింది.





