News

దేశంలో ఆర్థిక సంక్షోభం అన్నమాటే లేదు…

403views
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: భారత్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై లోక్​సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేదన్నారు. వృద్ధి నెమ్మదించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 7శాతం కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు నిర్మల. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి