
226views
ముంబాయి: తాను ఏ తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కారణంగా, శివసేన పార్టీని అస్థిరం కావించడం కోసమే తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని మనీ లాండరింగ్ కేసులో ఈడి అధికారులు అదుపులోకి తీసుకొనే ముందు చెప్పుకొచ్చిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆ కేసులో మరింతగా చిక్కువుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈడీ అధికారులు ఆరు గంటలకు పైగా తమ కార్యాలయంలో విచారించిన తర్వాత గత అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఓ సాక్షిని బెదిరించినట్లు ఆయనపై మరో కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. సంజయ్ రౌత్ కు సన్నిహితుడు సుజిత్ పాట్కర్ భార్య స్వప్నా పాట్కర్‌ను దుర్భాషలాడి, బెదిరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయింది.