న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్‌ను ఆదేశించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం జుబైర్‌కు లభించింది.
జుబైర్‌పై యూపీలో నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీ పోలీసు స్పెషల్ విభాగానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్‌పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్‌లో నమోదయ్యే ఎఫ్ఐఆర్లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును జుబైర్ ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.
Source: EtvBharat