News

ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర…నిందితుల అరెస్ట్!

449views

పాట్నా: సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బీహార్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

పాట్నా నగరంలో ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారు. దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి