News

ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు

391views

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ పరుష వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యావత్తు గిరిజన సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ద్రౌపది క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగారని, అజోయ్ కుమార్ వ్యాఖ్యలు ఆమెకు, ఆదివాసీ సమాజానికి తీవ్ర అవమానకరమని పేర్కొంది.

జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము భారత దేశపు అత్యంత దుష్ట భావజాలానికి ప్రతినిధి అని, ఆమెను ఆదివాసీలకు చిహ్నంగా పరిగణించకూడదని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి